– 71 శాతం పోలింగ్ నమోదు
– బాబాపూర్ గ్రామం లో మొరాయించిన ఈవీఎం
నవతెలంగాణ-బీంగల్ : పోలింగ్ కేంద్రాలను సందర్శించిన టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్
నవ తెలంగాణ భీంగల్…. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రశాంతంగా జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో 71 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ చిత్ర తెలిపారు మండలంలోని పల్లికొండ గ్రామంలో బూత్ నెంబర్ 194 లో ఓటర్ స్లిప్ లు అయిపోవడంతో పోలింగ్ ఆలస్యమైంది. ఓటు హక్కును వినియోగించుకుందుకు ప్రజలు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు .బాబా పూర్ గ్రామంలో ఉదయం ఈవీఎం మొరాయించగ వెంటనే సిబ్బంది సరి చేయడంతో యధావిధిగా పోలింగ్ కొనసాగింది. అలాగే బడా భీంగల్ గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే మైక్రో అబ్జర్వర్ ద్వారా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి అనుక్షణం పర్యవేక్షించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని ఉర్దూ మీడియం మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సందర్శించారు.