– 83 శాతం నమోదైన పోలింగ్
నవతెలంగాణ-తాడ్వాయి : తాడ్వాయి మండలంలో గురువారం జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటల వరకు కొనసాగింది. మండలంలో 83 శాతం పోలింగ్ నమోదయింది. గ్రామాలలో ఓటర్లు ఉదయమే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయారు. చిట్యాల, సోమారం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో చిన్న గొడవలు జరిగాయి. అధికారులు స్పందించి వెంటనే గొడవలను సద్దుమణిగించారు.మధ్యాహ్నం వరకే 60 శాతం పైనే పోలింగ్ నమోదయింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూతులకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పార్టీల నాయకులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో ఘర్షణ వాతావరణం నెలకొంది వివిధ పార్టీల నాయకులు రాత్రి సమయంలో ఎక్కడ పంపిణీ చేస్తున్నారనే విషయమై ఆరా తీస్తూ గ్రామాల్లో తిరిగారు గురువారం ఉదయం సైతం కొన్ని గ్రామాలలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సమాచారం తెలుసుకొని పోలీసులు తనిఖీలు నిర్వహించారు