నవతెలంగాణ – సారంగాపూర్: మండల అధ్యక్షునిగా కాల్వ నరేష్ ను బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి అనంతరం మండల అధ్యక్షులు నరేష్ తోపాటు మండల నాయకులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా నరేష్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షులు నరేష్ మాట్లాడారు.. నన్ను అధ్యక్షులుగా నియమించినదుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేసి..మండలంలోని అందరినీ కల్పుకొని బీజేపీ పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారయణ గౌడ్, మేడి సెమ్మి రాజు, కర్పె విలాస్, పథని నర్సయ్య, మధుకర్, మహేష్ రెడ్డి, దయాకర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.