రెంజల్ మండలం నీల గ్రామంలో సోమవారం బిసి సెల్ మండల అధ్యక్షులు గోసుల గంగా కిషన్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎమ్మెల్ రాజు ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే నిరుపేదలకు అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపకరిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల విభాగం జిల్లా నాయకులు సద్దాం, నీలా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సోక్కుల సాయిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.