గడప గడపకు 6సంక్షేమ పథకాల పై ప్రచారం

నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి సాగర్ మండలం ఎర్రచెరువు తండాలో మంగళవారం  ఉదయం 7 గంటల నుండి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలపై
కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తూన్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి ఆరు సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. హస్తం గుర్తుపై మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుటున్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ లు తారసింగ్-లక్ష్మి,  భీలు నాయక్, గ్రామ ఉప సర్పంచ్ రమేష్, హార్జీ, సేవ, బాలాజీ, కోటి, గంగు, రాజు, హనుమా, రామరాజు, వెంకట్, రమేష్, కృష్ణ నాగేశ్వరరావు, పాండు, బాల, రాత్తా, మంగత, వంశీ, నరేష్, రాజేందర్, రాంసింగ్, బబ్లు, పవన్  పాల్గొన్నారు.