గడప గడపకు 6సంక్షేమ పథకాల పై ప్రచారం

నవతెలంగాణ- బొమ్మలరామారం: అలేర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్లా ఐలయ్య గెలుపు కొరకు మండలం మర్యాల గ్రామంలో ఉదయం 7 గంటల నుండి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి ఆరు సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. హస్తం గుర్తుపై మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఈదులకంటి రాజిరెడ్డి, మొకు మధుసూదన్ రెడ్డి, చీర సత్యనారాయణ, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, దేశెట్టి చంద్రశేఖర్, దయాకర్ రెడ్డి, తోటో వెంకటేష్, చంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, నర్సిరెడ్డి, గోపి, కృష, ఉపేంద్ర, ఐలేష్, కలీం,జమీల్, చక్రి, వినోద్, శ్రీకాంత్, అభి,చంద్రం, తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.