– జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీమా పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు మూడ్నెళ్ల పాటు పి ఎం జె జె బి వై , పి ఎం ఎస్ బి వై పథకాల ప్రచారం ప్రతి గ్రామ పంచాయతీల్లో చేపట్టా లని కలెక్టర్ హనుమంతు కె జెండగే ఆదేశిం చారు. శుక్రవారం రోజున మినీ మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్ మాట్లడుతూ పీఎంఎస్బీవైలో ఏడాదికి రూ.20 ప్రీమియంతో ప్రమాద బీమా కవర్ అయ్యేలా 18-70 ఏళ్ల మధ్య వయస్సున్న వారు అర్హులన్నారు. పీఎంజేజేబీవైలో రూ.436 వార్షిక ప్రీమియంతో అన్ని రకాల మరణాలను కవర్ చేస్తుందన్నారు. 18-50 ఏళ్ల మధ్య వారు ఈ బీమా పొందవచ్చ న్నారు. ఈ బీమా పథకాలను అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల నుంచి పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ కే శివరామకృష్ణ,పశుసంవర్ధక శాఖ అధికారి వి కృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి సునంద రెడ్డి, బ్యాంకు ,నాబార్డు , పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.