– తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పోలీసులు భాగస్వామ్యం : సీపీ రంగనాథ్
నవతెలంగాణ-నర్సంపేట
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని… తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ప్రజలకు అర్థమైయ్యేలా ప్రచారం చేయ డంలో పోలీసులు భాగస్వాములవుతారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి లేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రం సాగునీరు,విద్యుత్‌రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. దాని ఫలిత మే నేడు 62 లక్షల ఎకరాలసాగు నేడు 122 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫ రా వ్యవసాయంగాన్ని మరింత ముందకు తీసుకెళ్లిం దన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినట్లయితే తెలం గాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3.20లక్షలకు పెరిగిం దని గణంకాల ద్వారా తెల్సుతుందని తెలిపారు.
ఇదేకాకుండా ప్రజలకు రక్షణ కల్పించడంలో తె లంగాణ పోలీసులు ముందు వరసలో ఉన్నారని గు ర్తు చేశారు. త్వరితగతిన నేర పరిశోదన, ముందు జా గ్రత్త చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం తగిన టెక్నా లజీని, వాహనాలను సమకూర్చిందన్నారు. కమిషన రేట్ పరిధిలో 20వేల పైగా సీసీ కెమెరాలను అమర్చ డం వల్ల కేసుల విచారణ, నేరం విచారణకు ఎంతగా నో ఉపయోగపడుతందని చెప్పారు.ఇంకా సమస్యలు ఉన్నాయని ఈఉత్సవాల్లో పోలీసులు ప్రజలను అడిగి వాటి పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా
నియోజకవర్గ అభివృద్ధి, దశాబ్ధి ఉత్సవాల నిర్వ హణపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికా రులతో సమీక్షించారు.నర్సంపేట పట్టణంలో రూ.5 కోట్లతో పాకాల ఆడిటోరియం ఈ ఉత్సవాలలో ప్రా రంభించడానికి మిగిలిపోయిన పనులను వేగవం తంగా పూర్తి చేయాలన్నారు. కుమ్మరి కుంట పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని, పట్టణంలో ఎస్‌ఎఫ్‌డీ కింద రూ.30 కోట్లతో కమ్యూనిటీ హాళ్ల ని ర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. అంబేద్కర్ భ వన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామ న్నా రు. ఇదేకాకుండా నియోజకవర్గంలో రూ.220 కోట్ల తో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌చే రోడ్ల పనులు కొ నసాగుతున్నాయన్నారు. వీటిని నిర్ణీతగడువులో పూ ర్తిచేయడానికి ఇంజనీరింగ్ అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను పది రోజుల్లో పూర్తి చేసి రోడ్ల రిస్టోరింగ్ మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.
అన్ని శాఖల పురోగతిని రూపొందించి దశాబ్ది ఉత్సవాలలో ప్రజలకు ప్రచారాల ద్వారా తెలియజెప్పి మరింత అభివృద్ధి చేపట్టడానికి తగిన సహకారం కోరుతామని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రణాళిక బద్దంగా శాఖల వారిగా పురోగతి నివేదికలను రూపొందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ పీ.కరుణా కర్, అదనపుకలెక్టర్లు అశ్వినీతానాజీ వాకడే, వాత్సల్య వివిధ జిల్లా స్థాయి, డివిజన్, మండల స్థాయి అధికా రులు తదితరులు పాల్గొన్నారు.