
ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని వడపర్తి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ జిన్నా సత్తయ్య , సంజీవ, పాండాల శరత్, షేక్ మహబూబ్ , షేక్ షానూర్ బాబు, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.