ఆరు హామీల అమలుపై గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ -ఆర్మూర్
తుక్కుగూడల సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను గడపగడపకు ప్రచారం చేస్తున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గోర్తా రాజేందర్ సోమవారం తెలిపారు. పట్టణంలోని రాజరానగర్ కాలనీలో  సిడబ్ల్యుసి మెంబర్  నియోజకవర్గ బాధ్యులు మదన్మోహన్ జా సీఎల్పీ లీడర్, బీహార్ శాసనమండలి సభ్యులు తుక్కుగూడలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను గడపగడపకు ప్రచారం చేయటానికి వచ్చిన సందర్భంగా వారికి సన్మానం చేసి పట్టణంలోని వివిధ ఇళ్లలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారం కొచ్చిన తర్వాత చేయబోయే ఆరు హామీలను గడపగడపకు ప్రచారం చేస్తూ వివరించడం జరిగినది అని మాజీ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గోర్తా రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు మారా చంద్రమోహన్, వినయ్ కుమార్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ సత్యనారాయణ ,మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ హబిబ్ ,ఫ్లోర్ లీడర్ మహిమూద్ అలి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కాళ్లగడ్డ శ్రీకాంత్ , ఎన్ ఎస్ యు ఐ నాయకులు అఖిల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.