విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగవచ్చు

–  ఐఎఎస్‌, ఐపిఎస్‌లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్‌ : క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఎఎస్‌, ఐపిఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కేటాయింపులపై అభ్యంతరాలున్న అఖిలభారత సర్వీసు అధికారుల విజ్ఞప్తులను మరోసారి పరిగణనలోకి తీసుకొని తిరిగి కేటాయింపులు జరపాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ఆయా ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తోన్న రాష్ట్రాల్లోనే కొనసాగొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో ఎపికి కేటాయించినా.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులతో 13 మంది ఐఎఎస్‌ అధికారులు తెలంగాణలోనే కొనసాగుతున్నారు.