కందకుర్తి పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత తీరేనా? 

Can Kandakurti school face shortage of teachers?నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండగా, కేవలం ఒకే ఒక పోస్ట్ కు ఉపాధ్యాయుడి నియామకం జరగడం శోచనీయమని కందకుర్తి గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పదవ తరగతి వరకు ఉర్దూ మీడియం కొనసాగుతూ ఉండగా కేవలం ఇద్దరు ఎస్ జి టి ఉపాధ్యాయులతో పాఠశాలను కొనసాగిస్తున్నారని, దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఇలాంటి ప్రయోజనం చేకూరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును దుస్తులను పెట్టుకొని సంబంధత విద్యాశాఖ ద్వారా నూతన పోస్టులను కేటాయించి డ్ఎస్సి లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను వారు కోరారు. ఈ పాఠశాలకు సుమారు ఎనిమిది మంది ఉపాధ్యా యులు అవసరం కాగా, కేవలం ఇద్దరు ఎస్జీటీలతో కొనసాగించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ నిమిషంలో స్థానిక ప్రజాప్రతి నిధులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని వారన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన పోస్టులను కేటాయించి ఉపాధ్యాయుల నియామకం చేయాలని ప్రజలు కోరుతున్నారు.