– రైతుబంధుతోనే సరిపెట్టిన గత ప్రభుత్వం
– సబ్సిడీ పరికరాల పంపిణీపై దృష్టి సారించాలని కోరుతున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
పంటల సాగులో ఖర్చుల తగ్గింపుతో పాటు పనులు వేగంగా చేసేందుకు యంత్రాలను వినియోగించాల్సి ఉంది. ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకానికి నిధులను కేటాయించకపోవడంతో ఈ పథకం స్వస్తి పలికినట్లేనా అనే సందేహం వ్యక్తమ వుతోంది. 2018 వర్షాకాల సీజన్ నుంచి రైతుబంధును గత ప్రభుత్వం అమలు చేసింది. పెట్టుబడి సాయం అందిస్తున్నామనే ఉద్దేశ్యంతో యంత్రాల కొనుగోలుకు సబ్సిడీకి నిధులను కేటాయించడం నిలిపివేశారు. ఫలితంగా రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాయితీ నిధులను మంజూరు చేసేవి. రైతులకు ప్లవ్లు, నాగళ్లు, కేజ్వీల్స్, రోటవేటర్లు, గొర్రు, పాలధీన్ కవర్లు, పసుపు ఉడికించే యంత్రాలు, మక్కలు ఒలిచే యంత్రాలను 30 నుంచి 50 శాతం రాయితీపై అందించేవారు.గత ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో యంత్రలక్ష్మి పథకాన్ని ప్రత్యేకంగా అమలులోకి తీసుకొచ్చి భారీ సబ్సిడీపై ట్రాక్టర్లను రైతులకు అందిం చారు. ఓ దశలో మండల వ్యాప్తంగా 6 ట్రాక్టర్లను ఒకేసారి రైతులకు అందించారు. ట్రాక్టర్ల కొనుగోలు భారం తప్పడంతో రైతులకు దుక్కి దున్నడానికి అనువైన మార్గం లభించింది. ప్రత్యేకించి మండలంలో వాణిజ్య పంటల సాగు ఎక్కువగా ఉండటంతో యాంత్రీకరణకు బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యం దక్కేది. ప్రతి ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రాయితీ పథకాలకు నిధులు మంజూరయ్యేవి. 2018లో యాంత్రీకరణ పథకం అమలును నిలిపివేయడంతో రైతులు రాయితీకి నోచుకోక ని ఆర్థిక భారం మోస్తున్నారు. గడచిన నెలలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో లో యాంత్రీకరణకు నిధులు కేటాయి స్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కానీ వాటి అమలు కోసం మార్గద ర్శకాలు జారీ చేయకపోవడంతో పథకం అమలుపై స్పష్టత లోపించింది. ప్రభుత్వం స్పందించి యాం త్రీకరణ కోసం ప్రోత్సాహకాలను పునరుద్ధరిం చాలని పలువురు కోరుతున్నారు.

సన్నకారు రైతులను ప్రోత్సహించాలి: అక్కల బాపు యాదవ్, రైతు సంఘం నాయకుడు
వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించాలి. 2018కి ముందు అమలు చేసిన రాయితీ పథకాలను పునరుద్ధరించాలి. ఎంతో మంది రైతులు యంత్రాలను కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు.