కాలువలు తవ్వి నీటిని నింపి … చెరువుల పండుగ చేయాలి

– డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్
నవతెలంగాణ – సిద్దిపేట
జిల్లాలో ఉన్నా రంగనాయక సాగర్ ,అన్నపూర్ణ సాగర్లను ఆగమేఘాల మీద ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు చెరువులకు ,కుంటలకు కాలువలను తవ్వకుండానే ,నీటిని నింపకుండా చెరువుల పండుగలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతు నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టు లు ఉన్నప్పటికీ , వాటిద్వారా చెరువు, కుంటలకు నీటిని విడుదల చేసేలా కాలువలు లేకపోవడంతో ప్రాజెక్టు లు వున్నా ఎలాంటి ఫలితం లేదన్నారు .ప్రాజెక్టు పూర్తిఐ 5సవత్సరాలు అయితున్నప్పటికి సిద్దిపేట నియోజక వర్గంలోని అన్ని చెరువు, కుంటలకు నీరివ్వకపోడం తో రైతులపై హరీశ్ రావు కు ఎంతప్రేముందో అర్థమైతుందన్నారు.  ముమ్మాటికీ మంత్రి హరీశ్ రావు రైతుల వ్యతిరేకి అన్నారు. నీరు లేక వేసిన పంటలు ఎండిపోయి రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉంటే ఏఒక్క బిఆర్ఎస్ నాయకులూ ఎందుకు పట్టించుకోలేదో ప్రజలు నిలదీయాలని కోరారు. చెరువుల పండుగ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృదా చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ప్రజావెతిరేకతను పక్కతోవ పట్టించేందుకే ఈ దావత్ లా డ్రామా అని ఎద్దేవా చేసారు .ఈ కార్యక్రమం లో నాయకులు మీసం మహేందర్ యాదవ్, ఉడుత జయంత్, బత్తిని గణేష్, సంధబోయిన పర్శరాములు , మహేందర్, వేణు కొమురయ్య, బాలమళ్ళు తదితరులు పాల్గొన్నారు.