కెనరా బ్యాంక్‌కు రూ.3,905 కోట్ల లాభాలు

3,905 crore profit for Canara Bankబెంగళూరు: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 10.5 శాతం వృద్థితో రూ.3,905 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయాలతో పాటు వడ్డీయేతర ఆదాయాలు, రికవరీలు పెరగడంతో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు ఆ బ్యాంక్‌ తెలిపింది. 2023-24 ఇదే క్యూ4లో రూ.3,539 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.8,666 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) గడిచిన క్యూ4లో 5.77 శాతం పెరిగి రూ.9,166 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం ఏకంగా 10.38 శాతం వృద్థితో రూ.5,319 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 5.15 శాతం నుంచి 4.14 శాతానికి తగ్గాయి. 2023 జూన్‌ ముగింపు నాటికి 1.57 శాతంగా ఉన్న నికర నిరర్థక ఆస్తులు.. 2024 జూన్‌ నాటికి 1.24 శాతానికి పరిమితమయ్యాయి.