న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో కెనరా హెచ్‌ఎస్‌బిసి లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభాలు తొమ్మిది రెట్లు పెరిగి రూ.91.2 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది రూ.10.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన 2022-23లో పన్ను చెల్లింపులకు ముందు రూ.100 కోట్ల లాభాలు ఆర్జించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో స్థూల ప్రీమియం వసూళ్లు 22 శాతం పెరిగి రూ.7,197 కోట్లుగా నమోదయినట్లు వెల్లడించింది. 2021-22లో రూ.5,890 కోట్ల ప్రీమియం చోటు చేసుకున్నట్లు తెలిపింది.