చీకటి జీవో 317 రద్దు చేయండి సార్‌…

గత ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవో 317 వలన ఎంతోమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం అవగాహన లేకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా తీసుకొచ్చిన ఈ చీకటి జీవో ఉద్యోగుల పాలిట ఓ గుదిబండగా మారింది. స్థానికతకు సరికొత్త నిర్వచనాన్ని చెప్పిన ఈ జీవోను ఉద్యోగులు వ్యతిరేకించినా పాలకులు పట్టించు కోలేదు. పాలనా సౌలభ్యం కోసమంటూ ఏర్పాటు చేసినా జిల్లాలను జోన్లుగా విభజించి ఎక్కడికి పడితే అక్కడికే బదిలీలు చేయడంతో కుటుంబాలకు దూరంగా ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు. మరికొంత మంది విధులకు రోజువచ్చి, పోయే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొంతమంది మనోవేధనకు గురై గుండెపోటు తో చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కల్పించిన జీవోను రద్దు చేయాలని శాంతియుత ధర్నాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేసినా నాటి పాలకులు స్పందించిన పాపాన పోలేదు. ఉద్యోగుల సర్దుబాటు పేరుతో సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా బలవంతంగా పక్క జిల్లాలకు బదిలీలు చేశారు. ఇది అన్యాయమంటూ ఎంత మొత్తుకున్నా పట్టించుకోకపోగా నిరసన తెలిపిన ఉద్యోగుల్ని అక్రమంగా అరెస్టులు చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. జీవోను రద్దు చేస్తామని హామీనిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్యక్షతన 317 జీవోపై మంత్రివర్గ సంఘం ఏర్పాటు చేశారు. ఈ జీవోను ఎప్పుడు రద్దు చేస్తారా అని ఉద్యోగులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు.ఉద్యోగ,ఉపాధ్యాయుల్లో రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తి, అలాగే ఆందో ళన వల్ల విధులు కూడా సక్రమంగా నిర్వహించలేక పోతు న్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజాపాలన సాగిస్తున్నట్టు మంత్రులు, అధికారులు చెబుతున్నారు. అది వాస్తవమేనని నిరూపించబ డాలంటే ఇచ్చిన మాట ప్రకారం జీవో 317ను రద్దుచేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తు న్నారు. తమ ఆవేదనను తెలియజేయ డానికి గాంధీ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లో గాంధీభవన్‌ వద్ద తల పెట్టిన మహా శాంతియుత ర్యాలీకి అత్యధికంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరా వాలని కోరుతు న్నాము.
– హరిశంకర్‌, 8639149923