పాలస్తీనియన్ల మద్దతు ర్యాలీని రద్దు చేయండి

– ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌
ఆస్ట్రేలియా: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ ఊచకోతకు పాల్పడి అక్టోబరు 7కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆస్ట్రేలియాలో పాలస్తీనియన్లకు మద్దతుగా చేపట్టనున్న ర్యాలీని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ తెలిపారు. సిడ్నీలో ఈవెంట్‌ను నిషేధించాలని పోలీసులు కోరుతున్నారు. అక్టోబరు 7న జరగనున్న ఈ కార్యక్రమం రెచ్చగొట్టేదిగా ఉందని, చాలా బాధను కలిగిస్తుందని అల్బనీస్‌ బుధవారం తెలిపారు. అల్బనీస్‌ ఆస్ట్రేలియా యొక్క నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. 12 నెలల మారణహౌమం, ఉగ్రవాదానికి సంతాపం అల్బనీస్‌ ప్రకటించారు. మరోవైపు అక్టోబర్‌ 6న జరగనున్న మరో పాలస్తీనియన్‌ అనుకూల కొవ్వొత్తుల ప్రదర్శనను నిషేధించాలని న్యూ సౌత్‌ వేల్స్‌లోని పోలీసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి దరఖాస్తు చేసిన తర్వాత అల్బనీస్‌ తన వ్యాఖ్యలు చేశాడు.