సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు…

– జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని , ఫిర్యాదులు ఇచ్చేందుకు రావద్దని తెలిపారు.