నవతెలంగాణ- ఆర్మూర్
ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్ అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ రద్దు చేసిన 3వేల బస్సులను పునరుద్దించాలని డిమాండ్ చేస్తున్నాం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ పై కక్ష సాధింపు చర్యగా ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా 3000 బస్సులను రద్దు చేసింది. వాటిని వెంటనే పునరుద్దించాలని , సెమీ డీలక్స్ బస్సులను పెంచుతూ, వందలాది ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం సరైన విధానం కాదు. కావున ఎక్స్ప్రెస్ బస్సులను కూడా పెంచాలని కోరుతున్నాం. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మహిళలను బద్నాం చేయడానికి ప్రభుత్వం కుట్ట పన్నుతుందా అని వారు అన్నారు ఈ విధానం సరైనది కాదని తెలియజేస్తున్నాము .కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సంవత్సరం గడుస్తున్న అనేక హామీలు పెండింగ్లో ఉన్నావని మహిళల పట్ల మరియు ప్రజల పట్ల ప్రభుత్వం వారి పథకాలను అమలు చెయ్యని యెడల లేన పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు,, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ నాయకులు ఎం.ముత్తన్న తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో,, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సంయుక్త మండలాల కార్యదర్శి బి.కిషన్ సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఎర్గట్ల మోర్తాడ్ మండలాల సంయుక్త కార్యదర్శి జి.కిషన్, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) భీంగల్ మండల కార్యదర్శి కె.రాజేశ్వర్ ,ఆర్మూర్ సబ్ సబ్ డివిజన్ సహాయ కార్యదర్శి ఎం.నరేందర్, మండల నాయకులు ఇస్తా రమేష్, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) వేల్పూర్ మండల నాయకులు జి.అరవింద్, టి యు సి ఐ నాయకులు నజీర్ ,శీను, ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బి.రవి, జిల్లా నాయకుడు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.