– వర్షాల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
– ఇంజినీర్ల కొరతా కారణమే
– జీవో 193 జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో సాధారణ బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం రదు ్దచేసింది. ఇంజినీర్ల బదిలీలకు శనివారం చివరిరోజైన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకుంది. కాగా నీటిపారుదల శాఖను ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. అలాగే తాజాగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టులు, రిజర్వా యర్లు, బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇంజినీర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో పని ఒత్తిడి తీవ్రంగా ఉందనేది ఇంజినీర్ల అభిప్రాయంగా ఉంది. ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ బి. అనిల్‌కుమార్ దృష్టికి సమస్యలను తీసుకొచ్చినట్టు తెలిసింది. ఆయన ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బదిలీల నుంచి నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు మినహాయింపును ఇచ్చినట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో నెంబరు 193ను విడుదల చేశారు. సాధారణ బదిలీలు చేసేందుకు ఈనెల మూడున జీవో నెంబరు 80ని జారీచేసిన విషయం విదితమే. తెలంగాణ ఇంజినీరింగ్ సర్వీసు నిబంధనల ప్రకారం శాఖాపరమైన అవ సరాలు, నిర్వహణ కోసమే ఇంజినీర్ల బదిలీలను రద్దుచేసినట్టు రాహుల్ బొజ్జా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.