యూనివర్సిటీ సెలవులు రద్దు..

నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రవీందర్ ప్రకటించిన సెలవులను విద్యార్థుల అభ్యర్థన మేరకు రద్దు చేస్తూ వీసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుండి తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని హాస్టల్స్ (మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్) లు తెరిచే ఉంటాయని, విద్యార్థులకు తరగతులు, తరగతి గదిలో రేపటి నుంచి ప్రారంభమవుతాయని సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.