పీహెచ్ సీలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వస్తవ క్యాన్సర్ కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు దాటిన మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా 170 మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ పరీక్షలు చేయడం జరిగిందని, ఆరోగ్యం విషయంలో మహిళలు  జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించి, రోగులకు  మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు యేమిమా, ఆదర్శ్, హెచ్ ఇ వో వెంకట రమణ, స్టాఫ్ నర్స్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.