గ్రంథాలయానికి పోటెత్తుతున్న అభ్యర్థులు

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల గ్రంథాలయానికి ఉద్యోగార్తులు పోటెత్తుతున్నారు.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విలువడుతున్న తరుణంలో పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి లతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకునేందుకు ప్రతిరోజు 100 మందికిపైగా అభ్యర్థులు వస్తున్నారు. స్థలభావం కారణంగా ఇక్కట్లు పడుతున్నారు. గత కొన్ని నెలల నుండి ఇక్కడకు వస్తున్న వారి సంఖ్య 1 75 కు పెరిగింది. నోటిఫికేషన్లకు తగ్గట్టు పుస్తకాలు అందుబాటులో ఉన్న చదువుకునేందుకు గదులు ,మూత్రశాలలు లేవని వాపోతున్నారు.. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు ఇక్కడే ఉండి పరీక్షలకు సన్నతం అవుతున్నారు ..ఈ క్రమంలో మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఉద్యోగాలు చెబుతున్నారు. గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని గదులను అందుబాటులోకి తీసుకొచ్చినారు .పుస్తకాలకు ఒక హాలు ఉండగా ,చదువుకునేందుకు పెద్ద హాలు, రెండు చిన్న గదులు ,గ్రంథ పాలకురాలి గది ని కూడా అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు.
మొదటి అంతస్తు నిర్మాణం: గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య రోజుకు పెరగడంతో ఇక్కడ ఉన్న ఇబ్బందులను సంబంధిత అధికారులు ,ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా పై అంతస్తు నిర్మాణ పనులు నడుస్తున్నవి: వరలక్ష్మి, గ్రంథ పాలకురాలు. ఆర్మూర్