లైంగిక దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

Candlelight rally to protest sexual assaultనవతెలంగాణ – కోనరావుపేట
బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తు. కొనరావుపేట మండలం నిమ్మ పెళ్లి గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ.. మెడికో విద్యార్థిని అత్యాచార ఘటన దురదృష్టకరం అన్నారు. అత్యాచార ఘటనకు పాల్పడిన దుండగులను బహిరంగంగా ఉరి తీయాలి  డిమాండ్ చేశారు, 78 సంవత్సరాల భారతావనిలో చిన్నపిల్లల నుంచి ముసలి పండు వరకు మహిళలకు భద్రత లేకుండా పోయింది. గాంధీ గారు ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళా స్వేచ్ఛగా ప్రయాణం చేస్తదో అప్పుడే స్వంత్రం వచ్చినట్టు అని అన్నారు. కానీ మహిళలకు వారు పనిచేసే ప్రదేశాల్లో కూడా  భద్రత లేకుండా పోయింది . నిర్భయ, దిశా చట్టాలు ఉన్న మానవ మృగాల్లో ఇంకా భయం లేకుండా పోతుంది. సమాజంలో మార్పులు రావాలిఈ కార్యక్రమంలో చెపురి గంగాధర్,అజీమ్ పాషా ,  పెంతల శ్రీనివాస్ , శ్రీదర్,రాజు నాయక్, వల్ల్య నాయక్, వినోద్ నాయక్ , మధు తదితరులు పాల్గొన్నారు.