నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో గంజాయి గుప్పుమంటుంది. పట్టణాల నుంచి పల్లెలకు చాపకింద నీరులా విచ్చలవిడిగా వ్యాపిస్తుంది. ఎక్కువ శాతం యువకులు, విద్యార్థులు మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.భూపాలపల్లి, వరంగల్, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి మండలానికి రవాణా అవుతున్న గంజాయిని పలువురు రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. మండలంలో ఎక్కువ తాడిచెర్ల,కొండంపేట, మల్లారం, పెద్దతూoడ్ల, గాదంపల్లి, అద్వాలపల్లి,దుబ్బపేట,రుద్రారం,నాచారం,ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో గంజాయిని రహస్యంగా విక్రయిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.గంజాయి యువకులు, విద్యార్థులు కొనుగోలు చేసి సిగరెట్లలో నింపుకొని రహస్యంగా తాగుతున్నారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించినప్పటికి రవాణ ఆగడం లేదు. సామాజిక ,మాధ్యమాల వేదికగా అక్రమార్కులు యథేచ్ఛగా గంజాయి దందా కొనసాగిస్తున్నారు. పట్టణాల నుంచి ఎండు గంజాయి మండల కేంద్రానికి పెద్దయెత్తున సరపరా అవుతుంది. పోలీసులు అడపాదడపా దాడులు చేయగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా చోద్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యసనపరుల్లో యువకులే..
మండలంలో ఎక్కువగా వ్యసన పరులుగా మారుతున్నవారు, రవాణా చేస్తున్నవారిలో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. వీరిలో విద్యార్థులు, యువకులు,కూలీలు తక్కువశాతంలో ఉంటున్నారని తెలుస్తోంది. జల్సాల కోసం కొందరు జీవినోపాది కోసం కొందరు గంజాయి వ్యాపారుల ఉచ్చులో ఇరుకున్నట్టుగా సంచారం.10 గ్రాముల గంజాయికి రూ.200 నుంచి రూ.300 వరకు కొనుగోలు చేసి నాలుగింతల ధరలకు విక్రయిస్తున్నారు. మండలంలో కొందరు యువకులు రహస్యంగా ఇంటి పెరటిలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లుగా, కొన్ని చిన్న కిరాణ దుకాణాల్లో సైతం చిన్న ప్యాకెట్లుగా సిగరెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. యువత సిగరెట్ లలో పొగాకును తీసివేసి గంజాయి పొడిని పెట్టి లేదా, పేపర్ ను గుండ్రంగా చుట్టి అందులో గంజాయిని నింపిపెట్టి పిలుస్తున్నారని తెలుస్తోంది.ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతాలు ,పురాతన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో, మూత్ర శాలల్లో, మైదానాల్లో, ప్రధాన రహదారుల ప్రక్కనున్న కల్వర్టులపై, శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని ఎక్కువగా రాత్రి వేళల్లో గంజాయిని పిలుస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన కొందరు అధికారులకు తెలిసి పట్టుకోవడానికి పోతే గంజాయి పిలుస్తున్న, అక్రమ రవాణా చేస్తున్న,అమ్ముతున్న, అడ్డాలవారు ఇస్తున్న మామూళ్ల మత్తులో మునుగుతున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైన భూపాలపల్లి, కాటారం పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు లోతుగా ఆకస్మికంగా తనిఖీలు చేపడితే పెద్దయెత్తున గంజాయి ముఠాను గుట్టురట్టు చేయడమే కాక గంజాయి ప్రియులను, రవాణా చేస్తున్న అక్రమార్కులను పట్టుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.