గంజాయిని అరికట్టాలి

గంజాయిని అరికట్టాలి– జన విజ్ఞాన వేదిక నాయకులు నూతనగంటి పురుషోత్తం
– ఏసీపీ రాజును కలిసి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నంలో రోజురోజుకూ విస్తరిస్తున్న గంజాయి మహామ్మారిని అరికట్టాలని, అందుకు తమ వంతు సహకారాన్ని అందజేస్తామని జన విజ్ఞాన వేదిక నాయకులు నూతన గంటి పురుషోత్తం తెలిపారు. శుక్రవారం ఇబ్రహీం పట్నం ఏసీపీ రాజును కలిసి విన్నవించారు. మర్యాదపూర్వకంగా ఆయన స న్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజ కవర్గ పరిధిలో ఇంజనీరింగ్‌ కళాశాలలో విస్తరించి ఉన్నాయన్నారు. ఈ కళా శాలలో విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా విద్యాభ్యాసం చేస్తున్నడంతో వారి ద్వారా గంజాయి మహామ్మారి ఈ ప్రాంత యువతకు అంటుకుందన్నా రు. కాలక్రమేన విద్యార్థులను నిత్య జీవితంలో గంజాయి భాగంగా మారిపో యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గ్రామీణ ప్రాంతానికి చెందిన యు వతకు సైతం విస్తరించిందన్నారు. గ్రామాల్లో దీని బారిన పడిన యువత తమ జీవితంలో నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మహామ్మారిని నిరోధించే క్రమంలో అనేక మందిని అ రెస్టు చేస్తున్న అదుపు కావడం లేదన్నారు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో సై తం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు జన వి జ్ఞాన వేదిక పూర్తి సహాయ సహకారాన్ని అందజేస్తుందని గుర్తు చేశారు. ఈ మహామ్మారిని పూర్తిగా నిరోధించే యువతను సన్మార్గంలో నడిపించేందుకు ప్రజలతో పాటు పోలీసు వ్యవస్థ సైతం ప్రజలతో మమేకమై కృషి చేయాలని కోరారు.