– గంజాయి రవాణా దారులతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం
నవతెలంగాణ-చందుర్తి : బండపల్లి గ్రామానికి చెందిన ఓయువకున్ని గంజాయి విక్రయిస్తున్నాడని ఓ యువకున్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అదుపురికి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది గ్రామానికి చెందిన మరోఇద్దరు యువకులు గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా అనుమానాలు ఉండగా గత కొద్ది రోజులుగా గ్రామంలో గంజాయి గుప్పుమంటోందని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో యువకుడ్ని అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో ఎవరెవరి పేరు బయటకు వస్తాయని చర్చ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపితే సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు బహిర్గతం కానున్నాయి.గ్రామస్తులు చర్చించు కుంటున్నారు.