లీడింగ్‌ బ్రాండ్‌గా కెనన్‌ కొనసాగింపు

లీడింగ్‌ బ్రాండ్‌గా కెనన్‌ కొనసాగింపున్యూఢిల్లీ : వరుసగా 21వ ఏడాదిలోనూ గ్లోబల్‌ కెమెరా మార్కెట్‌లో ముందంజలో ఉన్నట్లు కెనన్‌ పేర్కొంది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణలు, ఆఫర్లు, ఫ్రెండ్లీ మోడల్స్‌, ప్రొఫెషనల్‌ పవర్‌ హౌసెస్‌ తదితర అంశాలు కెమెరా మార్కెట్‌లో రాణించడానికి, తమ విజయానికి ప్రధాన కారణమని ఆ సంస్థ పేర్కొంది. తమ నూతన ఇఒఎస్‌ సీరిస్‌ ఉత్పత్తులు స్పీడ్‌, కంపర్ట్‌, అధిక నాణ్యతను కలిగి ఉన్నాయని పేర్కొంది.