అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శ

– కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి 

నవతెలంగాణ_తుర్కపల్లి 

ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య చేసే అభివృద్ధి పనులను చూసి మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత ఓర్వలేక విమర్శించడం సరైన పద్ధతి కాదని.మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ… ప్రభుత్వ విప్,బడుగు బలహీనవర్గాల నేత, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  విమర్శించే నైతిక హక్కు గొంగిడి సునీత  లేదని ప్రభుత్వ విప్ ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గోంగిడి సునిత విమర్శిస్తుందని అన్నారు.6 గ్యారంటీలను అమలుపరుస్తూ రుణమాఫీ, రైతుభరోసా, రైతు భీమా లాంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ప్రజా పాలన నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై గాని ప్రభుత్వ విప్ ఐలయ్య పై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ శంకర్ నాయక్,మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అసద్ బీ్గ్,యూత్ నాయకులు బానోత్ వినోద్ నాయక్,వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు….