దానిమ్మ రంగు రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు… ఇక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో అనేకం. అయితే, దానిమ్మ తొక్కలోని ప్రయోజనాల గురించి బహుశ చాలా మందికి తెలియకపోవచ్చు. తొక్కే కదా అని పడేస్తుంటాం. అయితే ఈ తొక్కలో కూడా అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు బ్యూటీ నిపుణులు. దానిమ్మ తొక్కను సన్ స్క్రీన్ గాను, మాయిశ్చరైజర్ గాను, ఫేషియల్ స్క్రబ్ గాను ఉపయోగించుకోవచ్చు. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి, కేశాలకు పోషకాలను అందిస్తుంది.
తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకొని మూత టైట్‌గా ఉండే డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ పౌడర్ స్కిన్, హెయిర్ బ్యూటీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.
మొటిమలను నివారిస్తుంది
దానిమ్మ తొక్క పౌడర్ మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. దానిమ్మ పౌడర్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది
దానిమ్మ పౌడర్ చర్మంలోపల విడుదలయ్యే కొల్లాజెన్‌ను విచ్చిన్నం చేసి, కొత్త చర్మకణాలు ఏర్పడేందుకు సహాయపడుతుంది. దాంతో ముఖంలో ముడుతలు, ఫైన్ లైన్స్‌ను నివారించుకోవచ్చు. దానిమ్మ పౌడర్‌కు కొద్దిగా పాలు మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని ముఖాని పట్టించి కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
హెల్తీ హెయిర్
దానిమ్మ పౌడర్‌ను కేశ సంరక్షణ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు . ఇది జుట్టు రాలడం అరికడుతుంది, చుండ్రు నివారిస్తుంది.
ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్
దానిమ్మ పౌడర్ చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది. ఇది చర్మంలోని పిహెచ్ బ్యాలెన్స్ ను తిరిగి పునరుద్దరింపచేస్తుంది. కొద్దిగా దానిమ్మ తొక్క పొడిని పెరుగులో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రపరుచుకోవాలి.