
అక్రమ అరెస్టు లతో పోరాటాన్ని ఆపలేరనీ బీఅర్ఎస్ మండల సీనియర్ నాయకులు గుగులోతు సురేష్ నాయక్ అన్నారు. వీర్నపల్లి మండలం బీఅర్ఎస్ మండల సీనియర్ నాయకులు గుగులోతు సురేష్ నాయక్ ను రైతుల రుణా మాఫీపై ప్రజా భవన్ ముట్టడికి వెళ్లకుండా ఎస్ ఐ ఎల్లయ్య గౌడ్ ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా బీఅర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజల పక్షాన చేసే ఉద్యమాన్ని ఆపలేరన్నారు . వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.