నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి, సాయన్న కూతురు గైని నివేదితను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి స్థానిక నేతలు, పార్టీ ముఖ్యులతో చర్చించిన తర్వాత ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.