
నిజం సాగర్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇసుకను వేలంపాట ద్వారా విక్రయిస్తున్నామని ఎమ్మార్వో బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజుల క్రితం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి మూడు ట్రాక్టర్లను ఎస్సై సుధాకర్ పట్టుకున్నాడని ఆట్టి ఇసుకను సోమవారం రోజు ఉదయం 11.30 కు నిజం సాగర్ పోలీస్ స్టేషన్లో వేలంపాట ద్వారా ఇసుకను విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. ఇసుక ధర ఒక్క క్యూబిక్ మీటర్ వచ్చి 662 గా ప్రభుత్వం నిర్ణయించిందని ట్రాక్టర్లో మొత్తం 2.50 క్యూబిక్ మీటర్ ల ఇసుక ఉందని ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు వచ్చి ఇసుకను వేలంపాట ద్వారా దక్కించుకోవాలని ఆయన సూచించారు.