– ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
– మద్యం మత్తులో బైకును ఢకొీట్టిన వ్యక్తి
– నిందితుడు మాజీ మంత్రి బంధువుగా అనుమానం
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైెదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి తప్పతాగి కారులో రాంగ్ రూట్‌లో వచ్చి ద్విచక్ర వాహ నాన్ని ఢకొీట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాల య్యాయి. కూకట్‌పల్లి ఏసీపీ శివ భాస్కర్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అగ్రజ్ రెడ్డి కార్తిక్, తేజతో కలిసి అర్ధరాత్రి 1:30 సమయంలో గచ్చిబౌలి నుంచి వారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ ఫోరంమాల్ చౌరస్తా వద్ద వారు రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్తూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢకొీట్టారు. దాంతో బైక్‌పై ఉన్న బన్వరిలాల్, గురుచంద్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు నడుపుతున్న అగ్రజ్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్టు నిర్ధారణయింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రజ్‌రెడ్డి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బంధువు అని తెలుస్తోంది. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ వెంకన్న, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఉన్నారు.