ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నెంబర్‌ 12 వద్ద కారు ప్రమాదం

Car accident at ORR exit number 12నవతెలంగాణ-ఆదిభట్ల
అదిబట్ల మునిసిపాలిటీ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నెంబర్‌ 12 వద్ద సోమవారం ఉదయం 3.30 గంటలకు కారు ప్రమాదానికి గురయింది. ఆదిభట్ల పోలిస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం… ఒంగోల్‌ లోని తెనాలి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్‌ మల్లీ కార్జున్‌, అతని అసిస్టెంట్‌ అబ్దుల్‌ రౌ ఫ్ఫ్‌ ఫోటో ఘాట్‌ ఆర్డర్‌ నిమిత్తం ఆదివారం శంకరపల్లి లోని త్రిపుర రిసార్ట్స్‌కు సారి ఫంక్షన్‌కు వెళ్ళి తిరగి ప్ర యాణం అయ్యారు. సోమవారం ఉదయం తెల్లవారు జామున వస్తుండగా ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నెంబర్‌ 12 వద్ద వీరు కారులో వెళుతుంటే ముందున్న హెవి వెహికల్‌ స్లోగా వెలడంతో సెకండ్‌ లైన్‌ లోకి మలుపుతుండగా డీసీఎంకు గుద్దడంతో ఫోటో గ్రాఫర్‌ మల్లీ కార్జున్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని అసిస్టెంట్‌ అబ్దుల్‌ రవుపు కి తీవ్ర గాయాలు కావడంతో బిఎన్‌రెడ్డిలోని నవీన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునామని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.