“కారు” సిచ్చు..

– బీఆర్ఎస్ అభ్యర్థి కిఎదురైన కార్యకర్తల విభేదాలు
నవతెలంగాణ -చందుర్తి
పార్టీ అంటే ఓక కుటుంబం అలాగే ఓ సీనియర్ నాయకుని కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది కానీ ఇక్కడ అది కాస్తా తిరగబడింది. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మి నర్సింహారావు ఆదివారం నర్సింగపూర్ గరమంలోని మల్లికార్జున స్వామి ఆలయం కు వెళ్లి దర్శించు కుందమని వెళ్ళాడు గ్రామంలోకి వెళ్ళగానే ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్లయ్య నర్సింహారావుకు మాజీ అధ్యక్షుడు మరాఠీ మళ్ళీ క్ ను పరిచయం చేసి సార్ కారులో ఎక్కించగా అక్కడనే ఉన్న మరో గ్రామస్థాయి ప్రజా ప్రతినిధి ఒకరు నేను ఉండగా మళ్ళీక్ ను ఎలా లక్ష్మి నర్సింహా రావు కారు ఎక్కిస్తావ్ అని నిలదీసి గొడవకు దిగారు.దింతో బిఆరెస్ అభ్యర్థి అసహనానికి గురికీనట్లుగా తెలిసింది. ఎదో బుజ్జగింపుల తో అక్కడ కార్య క్రమాన్ని ముగించుకొని  వెళ్లినట్లుగా సమాచారం. ఏది ఏమైనా కారు పార్టీలో సిచ్చు మొదలైనదని వినికిడి.