బాన్సువాడలో కారు జోరు

నవతెలంగాణ- నసురుల్లాబాద్: కారు ప్రచారం జోరందుకుంది. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్‌ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం నసురుల్లా బాద్ మండలంలోని దుర్కి, నెమ్లీ, మిర్జాపూర్, నసురుల్లాబాద్ గ్రామంల్లో మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే బీర్కూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీతో ఇంటింటికి వెళుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ జెడ్పిటిసి సతీష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ మండలం బారాస పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓట్లను విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్సువాడ లో పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును తెచ్చుకోవద్దు అన్నారు. రైతుబంధు వేస్ట్‌,  రైతుబంధు వేస్టా. మూడు గంటల కరెంట్‌ చాలని, ధరణిని ఎత్తేస్తామని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని ఆరోపించారు. రూ.200 నుంచి రూ.2వేల ఆసరా పింఛన్‌ పెంపుదల, పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌.. ఇలా చదివితే చాంతాడంత పథకాల లిస్టు అవుతుంది’ అని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఆయన ప్రజలకు వివరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి  దగ్గరకు ఎప్పుడు వచ్చిన నియోజకవర్గానికి అది కావాలి, ఇది కావాలి అని అడిగేవాడు తప్ప, ఏనాడూ తన సొంత పని కోసం అడగలేదన్నారు.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం బాన్సువాడ నియోజకవర్గం చుట్టూ తిరుగుతుందన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి జనం మనిషి.. జనం సాదక బాధలు తెల్సిన నాయకుడు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ ఫోరం కన్వీనర్ కంది మల్లేష్ సీనియర్ నాయకులు కిషోర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్యామల, మోహన్, డాక్టర్ నారాయణ వీరారెడ్డి, హన్మండ్లు, నర్సింలుగౌడ్, మైసగౌడ్, ఖలీల్ ,మోసిన్ తదితరులు పాల్గొన్నారు.