
– 13 ఏండ్లుగా నిర్విరామ సేవా.. అందరికి ఆదర్శం
– యువత స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ప్రో.కొదండరాం
– యువత స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ప్రో.కొదండరాం
నవతెలంగాణ – కంఠేశ్వర్
మానవత సేవకు కేరాఫ్ ఇందూరు యువత అని, స్వచ్ఛంద సేవా సంస్థ అనాధలకు అండగా నిలుస్తూ విధి వంచితులకు కొత్త రూపు తీసుకురావడం మామూలు విషయం కాదు అని 13 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవ అందరికీ ఆదర్శమని ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు డా.మద్దుకూరి సాయిబాబు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రో.కొదండరాం పాల్గోని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధలను చేరదీయటం నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అనాధ శవాలకి అంత్యక్రియలు చేయడం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.ఎవరు చేయలేని సేవా కార్యక్రమాలు చేస్తు అందరికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు.ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా గోప్ప సంకల్పంతో మనశ్శాంతి కోవెల ఆశ్రమ ఏర్పాటుకు స్దల సేకరణ చేయడం గోప్ప విషయమని కోనియాడరూ తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అధ్యక్షుడు చిట్టిమిల హరిప్రసాద్, రజనీష్,దారం గంగాధర్, రత్నాకర్,సుమీల,సూజాత పాల్గోన్నారు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.