– హాజరైన కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
యువత గుట్కా,గజాయ్,గుడుంబా తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాలపై కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి అవగాహన కల్పించారు. మంగళవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాటారం డిఎస్పీ ,సిఐ నాగార్జున రావు ముఖ్యదితులుగా హాజరై మాట్లాడారు. గ్రామంలో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో గజాయ్,గుట్కా,గుడుంబా తదితర నిషేధిత పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తుకు అలవాటై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. చదువుల్లో ఆటల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. అనంతరం వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి పత్రాలు లేనివి సిజె చేసి,ఉన్నవి వదిలేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.