పేటలో కార్డియాలజీ సౌకర్యం కల్పించాలి: లింగంపల్లి భద్రయ్య

– అదనపు కలెక్టర్ కు బిఎస్ లతా కి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో కార్డియాలజీ వైద్యం ప్రధానమైనది అని సామాజిక అధ్యయన వేదిక  కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య అన్నారు.బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతా కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద,మధ్యతరగతి ప్రజల కుటుంబాలు ప్రైవేట్ వైద్యం బారిన పడి ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయినీ అన్నారు.ఇలా ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం వైద్యం పై నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సూర్యాపేట అధ్యయన వేదిక తరపున మూడు సమావేశాలను విస్తృతంగా నిర్వహించి,ప్రభుత్వం ఇంకా కల్పించవలసిన వైద్య సదుపాయాల గురించి ముఖ్యమంత్రి కి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది అన్నారు.దీనిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్,డెంటల్ ఆపరేషన్, ఎన్ఆర్ఐ స్కాన్, ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలని, ఐసీయూ బెడ్స్ కెపాసిటీ పెంచాలని అన్నారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బందిని తగినంత మందిని నియమించి,నిభందనల మేరకు రోగులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలలో సమయపాలన పాటించేలా పర్యవేక్షణ పెంచాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ హాస్పిటల్, ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.నర్సింగ్ కాలేజీకి స్వంత భవనం విశాలమైన స్థలం కేటాయించి,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కాకుండా రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  ,కో కన్వీనర్ రేపాక లింగయ్య మరియు సభ్యులు షేక్ అబ్దుల్ కరీం,చామకురీ నర్సయ్య,ఆవుల నాగరాజు , నకిరేకంటి వెంకన్న,బయ్య దేవేందర్ ,పెరుమాల్ల కోటయ్య,మెంతబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.