అడ్వాలపల్లిలో కార్డున్ సెర్చ్

– అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
– కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్వాలపల్లిలో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి  అధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు,2 టాటా ఏసీలు, 2 ట్రాక్టర్లు  సీజ్ చేశారు.అక్రమంగా తయారు చేస్తున్న గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి  57 లీటర్ల నాటుసారాయి, 1600 లీటర్ల పులియవేసిన బెల్లం పానకం ధ్వంసం చేశారు.11 బిర్లు సీజ్ చేసి, గుడుంబా తయారు చేస్తున్న 4 గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడారు  ప్రజలు చట్ట వ్యతిరేక చర్యలు చేయకూడదని, యువత గంజాయి వంటి మతు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని, ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగర్జున రావు, మహాదేవపూర్ సిఐ రాజేశ్వర రావు, కొయ్యూరు కాటారం అభినవ్,సివిల్ అధికారులు, సీఆర్పీఎఫ్ ఫోర్స్, టిఎస్ఎస్ పి ఫోర్స్ మొత్తం 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.