న్యూఢిల్లీ : కార్పొరేట్ ఎజెన్సీ ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు ఇఎస్‌ఎఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు తెలిపాయి. దీంతో వినియోగదారులకు విస్తృత శ్రేణీలో ఆర్థిక పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి. తమ వినియోగదారులకు ఆరోగ్య బీమా పరిష్కరాలను అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఇఎస్‌ఎఎప్ ఎస్‌ఎఫ్‌బి ఎండి, సిఇఒ కె పౌల్ థామస్ తెలిపారు.