విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. 

– తెలంగాణ  విద్యా కమిషన్ సభ్యురాలు కందాడి జ్యోత్స్నా, శివ రెడ్డి

– కేజీబీవీ, గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ‌సందర్శన..
నవతెలంగాణ డిచ్ పల్లి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పా టు పరిశుభ్రతను పాటించాలని, విద్యార్థులకు  ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , కేజీబీవీ బాలికల విద్యాలయం, గిరిజన  విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలంగాణ  విద్యా    కమిషన్ సభ్యురాలు కందాడి జ్యోత్స్నా ,శివ రెడ్డి సూచించారు. గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులోని కెజిబివి బాలికల విద్యాలయం, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను అకస్మీకంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని, వంట శాలను,  బియ్యాన్ని, పప్పులను, కూరగాయలను, వంట సామాగ్రి  నాణ్యతను పరిశీలించారు. విద్యార్ధులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించి.. అక్కడి పరిస్థితులను విద్యా కమిషన్‌ సభ్యులు పరిశీలిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ పర్యటనకు సహకరించడంతో పాటు.. అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పా టు పరిశుభ్రతను పాటించాలి. విద్యార్థులకు  ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను సూచించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? లేదా ఆహార నాణ్యతపై విద్యార్థులను నేరుగా  అడిగి ఇబ్బందులు సమస్యలను  తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో కెజిబివి బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ వర్షా, గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అద్యాపాకులు పాల్గొన్నారు.