
రోడ్డు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించి రోడ్డు దాటాలని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకునే విధంగా వాహనదారులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఒక్క రోడ్డు ప్రమాదం చేయని డ్రైవర్లను గుర్తించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం వి ఐ అప్రోజ్, ఎం వి ఐ నాగలక్ష్మి, ఎఎంవిఐ తేజ, హర్షద్, శంకర్, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ఉపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.