ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశం సుస్థిర వృద్ధి కొనసాగనుంది కేర్‌ఎడ్జ్ రేటింగ్స్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణ మార్గంలో కొనసాగుతుందని, భారతదేశ జిడిపి వృద్ధి ఒక మోస్తారుగానే ఉన్నప్పటికీ,  FY 25లో 6.5%గా, FY 26లో 6.7% వద్ద ఆరోగ్యకరంగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. 2025 కి సంబంధించి సెక్టార్ ఔట్‌లుక్ పై నిర్వహించిన వెబ్‌నార్‌లో కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ తన అంచనాలను ప్రకటించింది. 2025లోఅంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ స్థిరంగా కొనసాగుతుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్‌లు తెలియజేస్తున్నాయి.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ & ఈడీ సచిన్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘స్థిరత్వం, స్థితిస్థాప కత ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటుండే  FY25 మొదటి సగం భారత దేశ కార్పొరేట్ సెక్టార్‌లో జాగ్రత్తతో కూడిన ఆశావాదాన్ని చిత్రీకరిస్తుంది. అనిశ్చిత అంతర్జాతీయ వాతావరణం మధ్య, ప్రైవేట్ మూలధన వ్యయం లో ఊహించిన ఊపు ఇంకా కార్యరూపం దాల్చనందున, దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉండడానికి వ్యాపార సంస్థలలో సంకోచం ఉంటుంది. అయినప్పటికీ, ఊహించిన ద్రవ్య విధాన సడలింపు మద్దతుతో 2025లో ప్రైవేట్ పెట్టుబడిలో మెరుగుదలని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ, ‘‘పబ్లిక్ క్యాపెక్స్‌లో సంకోచం, దీర్ఘకాలం కొనసాగే రుతుపవనాలు, బలహీనమైన పట్టణ డిమాండ్ H1 FY25లో వృద్ధి జోరును ప్రభావితం చేస్తాయి. కానీ, విని యోగంలో రికవరీ, ప్రభుత్వ క్యాపెక్స్‌లో పిక్-అప్ మద్దతు కారణంగా H2 FY25లో ఆర్థిక వృద్ధి పుంజుకుం టుందని మేం భావిస్తున్నాం. ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తి, పటిష్టమైన సేవల రంగం పనితీరు జీడీపీ పుంజుకోవడానికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం సీపీఐ ద్రవ్యోల్బణం రాబోయే త్రైమాసికాల్లో ఒక మోస్తరుగా ఉంటుందని అంచనా. పటిష్ఠమైన ఖరీఫ్ పంట మరియు రబీ విత్తడానికి అనుకూలమైన పరిస్థితుల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం మితంగా ఉంటుందని అంచనా వేస్తోంది. కూరగాయల ద్రవ్యోల్బణం మినహా సీపీఐ  ద్రవ్యోల్బణం గత కొన్ని నెలల్లో 4% కంటే తక్కువగా ఉందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రస్తావించింది. సగటు సీపీఐ  ద్రవ్యోల్బణం FY25లో 4.8% మరియు FY26లో 4.5%గా అంచనా వేయబడింది. FY25లో సగటు ద్రవ్యోల్బణం ~3.5% మరియు FY26లో 4.3%గా ఉండవచ్చని అంచనా వేయబడింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం FY25లో సగటున 2.5% మరియు FY26లో 3%గా అంచనా వేయబడింది.

ప్రభుత్వ ఆర్థిక అంశాల విషయానికొస్తే, నికర ఆదాయ సేకరణ అనేది బడ్జెట్ లక్ష్యంతో సమలేఖనం చేయ బడుతుంది. బలహీనమైన కార్పొరేట్ పన్ను వసూళ్లు ఆ సంవత్సరానికి ఆరోగ్యకరమైన ఆదాయపు పన్ను వసూలు ద్వారా భర్తీ చేయబడతాయి. వ్యయం వైపు చూస్తే, కేంద్రం క్యాపెక్స్ లక్ష్యం కంటే రూ. 1.5 ట్రిలియ న్లు తగ్గే అవకాశం ఉంది. నామినల్ జీడీపీ వృద్ధి అనేది FY25 కి సంబంధించి బడ్జెట్ వృద్ధి 10.5% కు బదు లుగా 9.9% వద్ద తక్కువగా అంచనా వేయబడింది. తక్కువ క్యాపెక్స్‌తో, FY25 కి సంబంధించి ద్రవ్య లోటు జీడీపీలో  4.8% గాకేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేస్తోంది, ఇది బడ్జెటెడ్ 4.9% కంటే స్వల్పంగా తక్కువ.

ఎగుమతుల విషయానికి వస్తే  FY25లో సరుకుల ఎగుమతులు 2.5% పెరుగుతాయని, సేవల ఎగుమతు లు 13% బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చని  కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేగాకుండా రెమి టెన్స్‌ లలో ప్రోత్సాహకరమైన ప్రదర్శనలు కొనసాగుతాయని భావిస్తోంది. మొత్తంమీద భారతదేశ కరెంట్ ఖాతా లోటు (CAD) FY25లో GDPలో 0.9% వద్ద నిర్వహించదగినదిగా ఉంటుందని అంచనా వేసింది.

నిర్వహించదగిన సీఏడీ, అధిక ఫారెక్స్ నిల్వలు రూపాయికి మద్దతు ఇస్తాయని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అభిప్రాయ పడింది. అయితే, బలమైన డాలర్ మరియు బలహీన యువాన్ కొంత బలహీనపరిచే ఒత్తిడిని తెచ్చే అవ కాశం ఉంది. ఎఫ్‌వై 25 చివరి నాటికి రూపాయి 84 వద్ద మరియు ఎఫ్‌వై 26 చివరి నాటికి 84-86 మధ్య ట్రేడ్ అవుతుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది.

ఆహార ద్రవ్యోల్బణం మధ్యస్థంగా ఉన్నందున 2025లో ఆర్బీఐ పాలసీ వడ్డీ రేటును 50-75 bps తగ్గించవచ్చని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడి FY25 చివరి నాటికి 6.5-6.6% మధ్య మరియు FY26 చివరి నాటికి 6.1-6.3% మధ్య ఉండవచ్చని భావిస్తోంది.

బీఎఫ్ఎస్ఐ ఔట్‌లుక్‌ గురించి కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘బ్యాంకు లలో, విలీనం యొక్క గరిష్ఠ ప్రభావం, ఆర్‌బిఐ అధిక రిస్క్ వెయిట్స్, క్రెడిట్ టు డిపాజిట్ రేషియో నిర్వహణ పై దృష్టి పెట్టడం వల్ల క్రెడిట్ వృద్ధి మందగించింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో ప్రైవేట్ బ్యాంకులకు ఎలివేటెడ్ క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి తగ్గు తుందని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

బ్యాంకుల్లో, నికర వడ్డీ మార్జిన్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అయితే, బ్యాంకులు ఇప్పుడు తక్కువ వృద్ధి అంచనా లకు అనుగుణంగా డిపాజిట్ రేట్లను సవరించడం ప్రారంభించాయి. బ్యాంకుల క్రెడిట్ ఖర్చులు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని మరియు ఇక్కడి నుండి పెరిగే అవకాశం ఉందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అభిప్రాయపడుతోంది.

అదేవిధంగా, NBFCలలో కూడా, FY’24లో క్రెడిట్ ఖర్చులు దిగువకు పడిపోయాయి, ఇక్కడి నుండి అవి పెరి గే అవకాశం ఉంది. అసురక్షిత ఆస్తి తరగతులలో, ప్రధానంగా ఎంఎఫ్ఐలలో, FY’25లో ఆస్తి నాణ్యతలో క్షీణత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొనసాగుతున్న ఎంఎఫ్ఐ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ ఖర్చు గణ నీయంగా పెరుగుతుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేస్తోంది.  అధిక క్రెడిట్ ఖర్చులు FY’25లో ఎంఎఫ్ఐల లాభదాయకతను గణనీయంగా ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తోంది

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఇన్వెంటరీ ఓవర్‌హాంగ్ క్షీణించడంతో 2025లో రెసిడెన్షియల్ డిమాండ్ దశాబ్దాల గరిష్ట స్థాయికి స్థిరంగా ఉంటుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేస్తోంది.  2023లో అత్యధిక అమ్మకాలతో రెసిడె న్షియల్ సెగ్మెంట్ వేగంగా పుంజుకుంది. ఈ ఊపు 9M 2024లో y-o-y వృద్ధి > 40%తో కొనసాగింది. రెరా అమలు తర్వాత కన్సాలిడేషన్, లగ్జరీ సెగ్మెంట్ ఊపందుకోవడం, గ్రీన్ బిల్డింగ్‌లు అధికం కావడం,  పటిష్టమైన కలెక్షన్‌లతో డీలీవరేజింగ్ చేయడం వంటివి అగ్రశ్రేణి సంస్థలకు సంబంధించి ముఖ్యమైన వృద్ధి చోదక శక్తులు గా ఉన్నాయి.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ రాజశ్రీ ముర్కుటే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఔట్‌లుక్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ సంస్థలకు సంబంధించి అమ్మకాలు & లాంచ్‌లలో రెండంకెల వృద్ధి, ~15 నెలల  ఇన్వెంటరీ, డెట్ టు కలెక్షన్ నిష్పత్తి 0.80x లోపుగా ఉండడం లాంటి అంశాలన్నీ   స్థిరమైన క్రెడిట్ ప్రొఫైల్స్‌కు మొత్తం మీద మద్దతునిస్తాయి. భూమి ధరలు,  నిర్మాణ వ్యయం పెరగడం ఒక కీలక సవాలుగా ఉండవచ్చు. ఇది ధరల అందుబాటుపై ప్రభావం చూపవచ్చు. అలాగే, సరసమైన గృహాల విభాగంలో సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం/డెవలపర్‌ల చొరవలను పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

ఆఫీస్ లీజింగ్ స్పేస్‌ విషయానికి వస్తే ఈ రంగం అంతర్జాతీయ అడ్డంకుల మధ్య నిలదొక్కుకోవాలని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ఆశిస్తోంది. ఆఫీస్ లీజింగ్ 2023 & 9M 2024లో బలమైన వృద్ధిని సాధించింది. 50+ msf వద్ద సప్లై మరియు స్వీకరణ బలంగా ఉండవచ్చని మరియు 80% కంటే ఎక్కువ ఆరోగ్యవంతమైన ఆక్యుపెన్సీతో ఈ రంగానికి ఔట్‌లుక్ స్థిరంగా ఉండగలదని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ విశ్వసిస్తోంది.

విమాన యానంలో, FY25-FY26కి GDP వృద్ధిలో 2x ప్రయాణీకుల రద్దీ పెరుగుతుందని, 2025-27 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాలకు సంబంధించి క్యాపెక్స్ థ్రస్ట్ రూ. 40,000 కోట్లుగా ఉంటుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. టారిఫ్ ఆర్డర్‌లో పెరుగుదల, నాన్-ఏరో రాబడిలో వృద్ధిని కూడా చూస్తోంది.   FY25 లో నాన్-ఏరో రాబడి 10-12% వద్ద పెరుగుతుందని, ప్రధాన PPP విమానాశ్రయాలకు 1.25x-2.25x పరిధిలో సుంకం పెంపుదల ఉంటుందని, ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా FY25లో ఎయిర్-కార్గో 9%-10% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం, జాతీయ రహదారుల నిర్మాణ వేగం FY25లో 10% తగ్గుతుందని అంచనా వేయబ డింది. అయితే HAM ప్రాజెక్ట్ బిడ్‌లు పోటీ తీవ్రతను పెంచుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, సవరించిన MCA కింద టోల్ ప్రాజెక్ట్‌ల వాటా FY26లో 15-20%కి పెరుగుతుందని అంచనా వేస్తోంది. FY25లో మొత్తం టోల్ వృద్ధి 7%గా అంచనా వేయబడింది.

డేటా సెంటర్ రంగానికి సంబంధించి FY25-27కి ~రూ.50,000 కోట్లతో క్యాపెక్స్ ఖర్చుతో బలమైన సంభావ్య త, సుస్థిరమైన దృక్పథాన్ని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ఆశిస్తోంది.   కోలో డీసీ సామర్థ్యం 2027 నాటికి ~2 GWకి రెట్టింపు అవుతుంది. FY25-27కి ఆదాయ అంచనా ~30% CAGR. లీవరేజ్ ప్రొఫైల్ అంటే మొత్తం రుణం/ EBIDTA అనేది 5x వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేయబడింది.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సబ్యసాచి మజుందార్ మాట్లాడుతూ ‘‘పునరుత్పాదక రంగంలో సామర్థ్య జోడింపు మరియు దేశీయ తయారీ వేగం పుంజుకోగలదని మేం భావిస్తున్నాం. సౌర శక్తి అందుబాటులో ఉండని సమయాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కారణంగా పవన, హైబ్రిడ్ టెండర్స్ ద్వారా పవన విభా గం పునరుద్ధరణ మోడ్‌లో ఉంది. థర్మల్ ఉత్పత్తికి సంబంధించిడిమాండ్ పెరుగుదల, పరిమిత సామర్థ్యం జోడింపుతో మెరుగైన దృక్పథాన్ని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

ఆతిథ్య రంగంలో, కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనా ప్రకారం పాన్-ఇండియా బ్రాండెడ్-హోటల్  RevPAR (రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్) FY24లో రూ. 4,900-5,000 గా ఉండగా, FY25లో రూ.5,200-5,400 గా ఏటేటా ప్రాతిపదికన 8-9% వృద్ధిని నమోదు చేసింది. FY25 ఆదాయం ఈ రంగానికి ఏటేటా ప్రాతిపదికన 8-9%  పెరు గుతుందని అంచనా. వచ్చే రెండేళ్లలో సరఫరా 4-5% వద్ద ఉండగా, డిమాండ్ 8-9% వద్ద వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. భారతదేశంలో ప్రస్తుతం సుమారుగా 166,000 బ్రాండెడ్ హోటల్ గదులు  ఉన్నాయి. ఈ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాలలో సుమారు 55,000 గదుల సామర్థ్యాన్ని జోడించగలదని అంచనా వేయబడింది, ఇది ప్రస్తుతం ఉన్న ఇన్వెంటరీలో 33%.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ రంజన్ శర్మ మాట్లాడుతూ, “H1FY25లో ఆటోమొబైల్ రంగం మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. ద్విచక్ర వాహన పరిశ్రమ ~16% ఆరోగ్యకరమైన ఏటేటా ప్రాతిపదికన వృద్ధి రేటుతో ముందుకు సాగింది, ప్రధా నంగా గ్రామీణ ఆదాయ స్థాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బలమైన గ్రామీణ డిమాండ్ కారణంగా, PV పరిశ్రమ గత 2-3 సంవత్సరాలలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిన తర్వాత, H1 FY25 సమయంలో  ఎంట్రీ-లెవల్ కార్లకు తగ్గిన డిమాండ్, డీలర్ వద్ద ఎలివేటెడ్ ఇన్వెంటరీ స్థాయిల కారణం గా మందగమనంలోకి ప్రవేశించింది. ఏటేటా ప్రాతిపదికన టోకు పరిమాణం వృద్ధి ~2%కి తగ్గింది. FY25 సమ యంలో ద్విచక్ర వాహనాల పరిమాణం వృద్ధి ఆరోగ్యంగా ఉంటుందని అంచనా వేయబడినప్పటికీ, మొత్తం మీద PV వాల్యూమ్ వృద్ధి FY25 లో మ్యూట్‌గా కొనసాగుతుందని భావించడమైంది’’ అని అన్నారు.

స్టీల్‌ రంగానికి వస్తే, కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం దిగుమతులు పెరగడం, ఎగుమతుల్లో క్షీణత కారణంగా అమ్మ కాల  క్షీణత కారణంగా H1FY25లో స్టీల్ సంస్థలు లాభదాయకత ఒత్తిడిలో ఉండిపోయాయి. H1FY24 కంటే H1FY25లో భారతదేశం ఉక్కు నికర దిగుమతిదారుగా మారింది. మౌలిక వసతుల కార్యకలాపాల్లో   ఊహిం చిన పిక్-అప్‌తో డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో H2FY25లో స్ప్రెడ్‌లలో స్వల్ప మెరుగుదల ఉండవచ్చని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అభిప్రాయపడింది; FY25లో సమీకృత ఉక్కు ఉత్పత్తిదారులతో పోలిస్తే ద్వితీయ తరహా స్టీల్ సంస్థలు సాపేక్షంగా మరింత ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

ఫార్మాలో, మార్జిన్‌లు మెరుగుపడటంతో ఈ రంగం ఆరోగ్యకరమైన వృద్ధిని ఆశించవచ్చు. FY24లో ఫార్మా పరిశ్రమ ~ 9% వృద్ధిని సాధించింది. ఇది FY25-FY26 సమయంలో 9-10% వద్ద వృద్ధి చెంది సుమారు $65 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కాంప్లెక్స్, స్పెషాలిటీ డ్రగ్స్‌పై పెరుగుతున్న దృష్టి, పేటెంట్ గడువు ముగిసే అవకాశాలు, సీడీఎంఓ సెగ్మెంట్‌తో పాటు పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల స్థితిగతులు పరిశ్రమ వృద్ధికి తోడ్పడవచ్చు. ఆపరేటింగ్ మార్జిన్‌లు వచ్చే ఏడాది కాలంలో 50-100 bps వరకు విస్తరించే అవకాశం ఉంది.