కంటం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని అంకాపూర్ గ్రామంలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహనా సదస్సు విజయవంతంగా నిర్వహించబడిందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్నారై శ్ర రవీందర్, శ్రీమతి మనోరమా లు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికల దిశానిర్దేశం, కెరీర్ ఎంపికలు, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై వివరించి, సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సుమారు 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సదస్సులో రవీందర్ కంతం తో పాటు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ సల్ల మోహన్ రెడ్డి, శ్రీ రాచకొండ చంద్రశేఖర్, శ్రీ భోగి తిరుమల రావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల బృందం తదితరులు పాల్గొన్నారు.