– ఆరు నెలలుగా రాత్రి, పగలు వెలుగులు
– గ్రామ కార్యదర్శులు, తాజా మాజీ సర్పంచుల నిర్లక్ష్య వైఖరి
– స్పెషల్ ఆఫీసర్లు వచ్చినా పర్యవేక్షణ కరువు
– పలు వీధులు చిమ్మ చీకట్లోనే
– ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని, గ్రామపంచాయతీ విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తాడూరు, పిరాట్వానిపల్లి, రాయిచేడు గ్రామ పంచాయతీలలో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్నాయి. గ్రామాలలో వందలకొద్దీ ఎల్ఈడి లైట్లు విద్యుత్ కాంతితో విరజిల్లి మిల మిల మెరుస్తూ దర్శనమిస్తున్నాయి. విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్న కిందిస్థాయి అధికారులు మాత్రం ఎలాంటి చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ దీపాలపై జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్, కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేకతారు చేశారు. దీంతో గ్రామపంచాయతీకి అధిక బిల్లులు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ను పొదుపుగా సమయానికి వాడుకునేలా చూడాలని థర్డ్ లైన్ కి లేని వాటికి ఆన్ ఆప్ లు ఏర్పాటు చేసి రోజువారి విధిగా సాయంత్రం వేళలో ఆన్ చేసి ఉదయాన ఆఫ్ చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరారు. కొన్ని వీధిలైట్లకు ఆన్ ఆఫ్ ఉన్న పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు, పలు వీధులలో బల్బులు వెలగకపోయినా నెలలు గడిచిన వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడం చిమ్మ చీకట్లో బయటికి అడుగు పెట్టాలంటే భయాందోళనలకు గురవుతున్న కాలనీవాసులు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు.