నవతతెలంగాణ- మంగపేట
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడానికి రాష్ట్ర స్థాయిలో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల ఫండ్ ఇవ్వాలని మండల ఉద్యమకారుల సంఘం నాయకులు పప్పు వెంకట్ రెడ్డి, ఎస్కే.కర్బాన్ అలీలు డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర గౌరవ అద్యక్షుడిని కలిసి తమ సమస్యలను వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తేవాలని కోరారు. ఈ సందర్బంగా పెద్ద సుదర్శన్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పని చేసిన నాయకులను గుర్తించి ఆదుకోవాలని మాట్లాడడం హర్సించదగ్గదని కొనియాడారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షులు గాదె శ్రీనివాసాచారి, కో కన్వీనర్ ఈదునూరు రవీందర్, కుంట ఏడుకొండలు, చిలకమర్రి రాజేందర్, మలికంటి శంకర్, గూడా వాసుదేవమూర్తి, చీకుర్తి సుధాకర్, మేదిడ సతీష్, అప్జల్, కర్రీ శ్రీనివాస్, లోడే కృష్ణలు పాల్గొన్నారు