పల్లె ప్రకృతి వనంలో చెట్లు నరికిన వ్యక్తిపై కేసు నమోదు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను నాటగా, కొన్ని రోజుల క్రితం దాదాపు 30 చెట్లు కొట్టి వేసి నాశనం అయ్యి ఉండగా, విచారణ చేపట్టిన అధికారులు, అదే గ్రామానికి చెందిన పిట్ల రామయ్య  అనే వ్యక్తి  చెట్లను నరికి వేసినట్లుగా నిర్దారణ కావటంతో, ఈరోజు రాం పూర్ గడ్డ గ్రామపంచాయతీ సెక్రెటరీ అయిన స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.